BREAKING
దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం శిశు మంగళ్ అనాథ ఆశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు: పిల్లలకు కానుకలు అందజేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట వెలుగులు.. సొంతింటి కల సాకారం : సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్

నవాబుపేట, మేజర్ న్యూస్:దీపావళి పండుగను పురస్కరించుకుని నవాబుపేట మండల పరిధిలోని గంగ్యాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి దోసడ మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామేనా భీమ్ భారత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన ఇందిరమ్మ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద రిబ్బన్ కట్ చేసి గృహాన్ని ప్రారంభించారు. ఇంటి యజమాని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వీట్ల బాక్సులు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పామేనా భీమ్ భారత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కలను నెరవేర్చే గొప్ప పథకమని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది చిరకాల స్వప్నమని, ఆ కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.దీపావళి పండుగ చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొంటూ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని, పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మేడిపల్లి వెంకటయ్య, నవాబుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొండల్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగపూర్ రమేష్, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ యూత్ ప్రధాన కార్యదర్శి భానూరి ఉపేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.