BREAKING
దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం శిశు మంగళ్ అనాథ ఆశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు: పిల్లలకు కానుకలు అందజేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట వెలుగులు.. సొంతింటి కల సాకారం : సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు

కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి

Select Suryaa Now
కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి

 

• ఐదుగురు వ్యక్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

• రూ.1,800 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

సూర్య, బెజ్జూరు:

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దసిద్దాపూర్ గ్రామ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. బెజ్జూరు ఎస్‌ఐ కె. రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడిలో డబ్బులు పందెంగా పెట్టి, కోళ్లకు కత్తులు కట్టి కోడిపందాలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ దాడిలో కోడిపందాల కోసం వినియోగిస్తున్న రూ.1,800 నగదుతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ కె. రమేష్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. కోడిపందాలు నిర్వహించడం, వాటిపై బెట్టింగ్‌లు కాయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా కోడిపందాలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ కోరారు.