పరిటాల ఘాటుకు నివాళులర్పించిన తూంచర్ల నూతన ఎంపీటీసీ పోతులయ్య!!
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన కనగానపల్లి మండల తూంచర్ల ఎంపీటీసీ పోతులయ్య ఆదివారం వెంకటాపురం లో పరిటాల రవీంద్ర ఘాటును సందర్శించి నివాళులర్పించారు. అలాగే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ ను గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను వారు శాలువాతో సత్కరించారు. తనపై నమ్మకం ఉంచి ఎంపిటిసి అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మకు పరిటాల శ్రీరామ్ కు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతాయుతంగా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మహిళా నాయకురాలు స్రవంతి పాల్గొన్నారు.
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య