BREAKING
వత్సవాయిలో దీపావళి సందడి.. టపాసుల కొనుగోళ్లతో కిటకిటలాడుతున్న దుకాణాలు లోకేశ్వరం మండలం కాండ్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు. : దీపావళి సర్ప్రైజ్ ఇచ్చిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్: మొదటిసారి బాబు విహాన్ ఫొటో షేర్ చేసిన జంట దీపావళి వేళ అభిమానులకు క్షమాపణలు కోరిన అమితాబ్ బచ్చన్: చేతి నొప్పితో లేఖలు రాయడంలో ఇబ్బందులు వెల్టూర్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి పైర్ చిత్రంలో నటనానుభవం లేని వృద్ధులకు అవకాశం: దర్శకుడు వినోద్ కప్రి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విశేషాలు మంచిర్యాలలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దీపావళి వేళ చెన్నైలో కోలాహలం: అభిమానులను పలకరించిన సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు శ్రీరామనగరంలో భక్తి పారవశ్యం: చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర వేడుకల్లో పాల్గొన్న జూపల్లి రామేశ్వరరావు రజనీకాంత్ 'ధర్మన్‌'లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్‌ పోతినేని.. అరిచిపోయే యాటిట్యూడ్‌తో గ్రాండ్ వెల్కమ్ ప్రజాసేవలో సిఎం రేవంత్ రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు దీపావళి పండుగ వేళ ప్రతి ఇంట ఆనందం వెళ్లివిరియాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.కే బాషా సుమంత్ ప్రభాస్ 'బబ్లూ XXL' నుంచి మ్యాజికల్ ఫస్ట్ స్పార్క్ విడుదల.. యూత్‌ను ఆకట్టుకునేలా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు

కేఫ్ సెంటర్లలో .. సిగరెట్ ప్రియం ప్రియం

Select Suryaa Now
కేఫ్ సెంటర్లలో .. సిగరెట్ ప్రియం ప్రియం


ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి

సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు తాగే సిగరెట్టు  అని 1978 లో  ప్రాణం ఖరీదు సినిమాలో హాస్యానటుడు ఎల్. రాజా హాస్యంగా పండించిన పాట ఇది.. అలా సరదా సరదా కోసం తాగే సిగరెట్ ధరలు ప్రియం ప్రియంగా మార్చారు .. ఈ మధ్యలో అధికమైన చాయ్ వాలా సెంటర్లు ధూమపాన ప్రియున్ని దోచుకుంటున్నాయి. ఒక్కొక్క సిగరెట్ ప్యాక్ పైన వంద రూపాయల నుండి 120 రూపాయలకు పెంచి అమ్ముతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇక్కడ మీకు ఏర్పాటుచేసిన సౌకర్యాలకు ట్యాక్స్ రూపాన సిగరెట్ రేటు పెరుగుతుందని తేల్చి చెబుతున్నారు.. అలా దోచుకుంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు.. ఇకపోతే ధూమపాన నిషేధ చట్టం 2003 చాయ్ కట్టాలకు వర్తించదా.. సెక్షన్ 4 కింద బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ఉంటే 
మిస్టర్ చాయ్ ఇవ్వండి అలాగే ఒక సిగరెట్ ప్యాక్ ఇవ్వండి అంటూ ధూమ ప్రాణ ప్రియుల అక్కడ కూర్చొని చాయ్ తాగుతూ గుప్పు గుప్పుమని పొ గలు వదులుతూ  వారి చుట్టూ ఉన్న ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్న పట్టించుకోరు..
ఇదే ఆదునుగా దుకాణదారులు ఈ ప్రియుల కోసం వేసిన కుర్చీలలో ధూమపాన ప్రియులను కూర్చోబెట్టి టీలు సిగరెట్లు అందించడం పొరపాటిగా మార్చుకున్నారు. ఎక్కడైనా బార్లలో మద్యం ప్రియులు తాగిన మత్తులో అధిక ధరలు చెల్లించి పోతారు అనుకుంటే ఇక్కడ ధూమపాన ప్రియులు మాత్రం సిగరెట్ మోజులో పడి చాయ్ అడ్డవారు ఎంత దోచుకుంటే అంత ధూమపానం అనే మత్తులో చెల్లింపులు చేసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తాగే సిగరెట్లు నిషేధించడంతోపాటు ధూమపాన ప్రియుల జేబులు కూడా గుల్ల కాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది..
అంతేగాక అక్కడ ధూమపానం వల్ల ఇతరులకు జరిగే ప్రాణనష్టాన్ని అదుపు చేయాల్సిన పరిస్థితులు అధికారులపైనే ఉన్నాయి. పట్టణ నడిబొడ్డులో ఉన్నావుగా చాయ్ సెంటర్లో ధూమ ప్రాణ ప్రియులు సిగరెట్ ప్యాక్ కొనబోయి ధరలు చూసి కంగుతిన్నారు. రూ.325 ఉన్న సిగరెట్ ప్యాక్ ధర  రూ.440 కి అమ్ముకుంటున్న చోద్యం చూస్తున్నారు అని అధికారులపై మండిపడుతున్నారు.
A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా