BREAKING
ముంబై కేఈఎం ఆస్పత్రి వైద్యుల అద్భుతం..కేవలం 700 గ్రాముల ప్రసవ శిశువుకు పునర్జన్మ ఉత్కంఠ పోరులో భారత్‌పై పాకిస్తాన్ విజయం, అర్జున్ రాజ్పుత్ శతకం వృథా వెస్టిండీస్ బ్యాటర్ కెవిన్ విక్రమ్ అరుదైన రికార్డు: 48 ఏళ్ల తర్వాత పునరావృతమైన చారిత్రాత్మక ఘనత బంగ్లాదేశ్ వాణిజ్య లోటు 31 శాతం దూసుకెళ్లింది వెస్టిండీస్ భారీ ఆధిక్యం: అద్భుత శతకంతో చెలరేగిన కెవెం హాడ్జెస్ కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. 4.5 లక్షల కొత్త పింఛన్లు మంజూరు : సీఎం రేవంత్ రెడ్డి బంగ్లాదేశ్ వస్త్ర రంగ కార్మికులపై తీవ్ర ప్రభావం: నివేదిక అండర్-19 ఆసియా కప్: సెంచరీతో పోరాడిన అర్జున్ రాజ్‌పుత్.. పాకిస్థాన్ చేతిలో భారత్‌కు ఓటమి పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు బస్తర్‌లో దీపావళి వేడుకలు, శాంతి, శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచాయన్న స్థానికులు నవకాంతుల ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు పోలాండ్‌లోని క్రాకో నగరంలో ఘోర కాల్పుల ఘటన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ నుంచి తప్పుకున్న రజత్ పాటిదార్: జట్టులోకి ఆయుష్ బదోని ఎంట్రీ న్యూజిలాండ్‌కు చెత్త రికార్డు: భారత్ చేతిలో ఓటమితో 21 ఏళ్ల నాటి రికార్డు బద్దలు టర్ఫ్‌పై జారిపడిన ఓపెనర్: గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన షాద్‌మాన్ ఇస్లాం

ప్రజాసేవలో సిఎం రేవంత్ రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్

Select Suryaa Now
ప్రజాసేవలో సిఎం రేవంత్ రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్

మునుగోడు,మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సురిగి నరసింహ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాలుట్ల ప్రేమ్ కుమార్, నందిపాటి యాదయ్య, అన్నం శ్రీశైలం, నందిపాటి జనార్ధన్, సురికి కిష్టయ్య గౌడ్, సురిగి శంకరయ్య, పంతంగి నరసింహ, బత్తుల నాగరాజ్ గౌడ్, దశరథ గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.