నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే లక్ష్యం : అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి:
దిలావర్‌పూర్ మండలం న్యూలోలం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో ఇన్‌చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ పాల్గొని, లబ్ధిదారుడి ఇంట్లో దీపాలు వెలిగించి దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీవో అరుణారాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.