BREAKING
దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం శిశు మంగళ్ అనాథ ఆశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు: పిల్లలకు కానుకలు అందజేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట వెలుగులు.. సొంతింటి కల సాకారం : సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు

యాలాలలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
యాలాలలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

యాలాల, మేజర్ న్యూస్:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను యాలాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించారు. యాలాల పీఏసీఎస్ చైర్మన్ చెన్నారం భీమ్‌శెట్టి అనిల్ కుమార్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ ఆధ్వర్యంలో యాలాలలోని చెన్నారం అనిల్ కుమార్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలకు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలం, నినాదాల మధ్య వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ మరింత ముందుకు సాగాలని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్, ఎల్మ కన్య జనార్దన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అగ్గనూర్ వీరేశం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.