BREAKING
యూట్యూబ్ స్టార్ నాగదుర్గ ఊరమాస్ తీన్‌మార్.. ‘ఇడుపు కైథం’ మూవీ క్రేజీ అప్‌డేట్! ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు పండగ పూట ఘట్టమనేని ఇంట సందడి.. అక్క బర్త్ డే వేడుకల్లో తళుక్కుమన్న సూపర్‌స్టార్! థియేటర్లలో మళ్లీ ‘దశావతారం’ సంచలనం.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్! నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లి పీటలెక్కిన హీరోయిన్.. బిజినెస్‌మెన్‌తో గ్రాండ్ వెడ్డింగ్! జపాన్‌లో సూర్య 48 హంగామా.. దీపావళి తర్వాత మేజర్‌ షెడ్యూల్‌కు సర్వం సిద్ధం! దీపావళి సందడి..క్రాకర్స్ దుకాణాలతో కళకళ! నాగార్జున 100వ సినిమాలో పవర్‌ఫుల్ విలన్.. రూమర్స్‌కు చెక్ పెట్టిన మేకర్స్ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కొండపల్కలలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు... అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం వికసించని కమలం.. పగిలిన గ్లాసు మెరుగైన వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

వికసించని కమలం.. పగిలిన గ్లాసు

Select Suryaa Now
వికసించని కమలం.. పగిలిన గ్లాసు


ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి 
రాష్ట్ర ప్రభుత్వం కూటమి కూటమి అంటూ  మూడు పార్టీలతో జతకట్టి ముందుకు పోతుంటే  స్థానికంగా ఎమ్మిగనూరులో కూటమికి పోటు పొడిచారు.. అధికార టిడిపి ఎమ్మెల్యే పొత్తు ధర్మాన్ని పాటించకుండా బిజెపి నిలబడిన స్థానాలతో పాటు జనసేన నిలబడిన స్థానాలపై కూడా టిడిపి అభ్యర్థులను స్థానిక ఎన్నికల  బరిలోకి దించారు..
రాష్ట్రంలో కూటమి కట్టిన భాజపా, జనసేన,టిడిపిల పొత్తు ధర్మం క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో  మునిసిపాలిటీ, జెడ్పిటిసి, ఎంపీటీసీ, ఎన్నికల్లో  ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలు కారణంగా వికసించని కమలం, పగిలిపోయిన గ్లాసు అన్న చందంగా పొత్తుకు పోటు గా తయారయింది.. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కచోట కమలం వికసిస్తే.. గ్లాసు పోటీ చేసిన ప్రతి చోట సైకిల్ కూడా ఎన్నికల రంగంలో దిగి పొత్తు ధర్మాన్ని విస్మరించారు. దీనితో గ్లాసు పార్టీ కూడా ఒకచోటనే గెలుపొంది సర్దుబాటు చేసుకుంది.. ఈ రెండు చోట్ల టిడిపి పోటీ చేయకపోవడంతోనే ఆ గెలుపొందింది.ఇక ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలకు వచ్చేసరికి అదే పంతా కొనసాగించారు సైకిల్ నాయకులు.. కమలం, గ్లాసు పోటీ చేసినచోట టిడిపి కూడా ఎన్నికల బరిలో దిగడం.. టిడిపి రెబెల్ అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్ లుగా పోటీ కి దిగడం జరిగిపోయింది.. ఒక జెడ్పిటిసి ఎమ్మిగనూరు స్థానాన్ని జనసేనకు కేటాయించినా కలిసికట్టుగా పనిచేయకపోవడంతో భారీ ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.. నియోజకవర్గంలోని నందవరం మండలంలో రెండు చోట్ల ఎంపీటీసీ  బీజేపీ అభ్యర్థులు బరిలో ఉంటే ఆయా స్థానాల్లో ఒకటి టిడిపి పోటీలో దిగడం ఏమిటో అర్థం కానీ విషయం. మరొకటి టిడిపి రెబల్ అభ్యర్థులు బరిలో దిగారు. ఒకచోట జనసేన పోటీ చేస్తే అక్కడ కూడా టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి  ఎన్నికల రంగంలో దింపింది.అంటే దీనిని బట్టి చూస్తే పొత్తుకు పోటు పొడిచారా లేదా అన్నది అర్థమవుతుంది.. గోనెగండ్ల.. 1 ఎంపీటీసీ జనసేన నిలబడితే అక్కడ టిడిపి పోటీ చేసింది, గోనెగండ్ల..2 ఎంపిటిసి స్థానంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది  గోనెగండ్ల.4 ఎంపీటీసీ స్థానంలో కూడా పొత్తు ధర్మం పాటించలేదు. ఇదే పరిస్థితి గోనెగండ్ల ఐదు ఎంపిటిసి స్థానంలో కూడా నెలకొంది. వేము గోడు ఎంపిటిసి గా కూడా జేఎస్పీ పోటీ చేస్తే అక్కడ కూడా టిడిపి అభ్యర్థులకు రంగంలో ఉన్నారు.దీంతో గోనెగండ్ల మండలంలో ఐదు చోట్ల పోటీ చేసిన జనసేన ఒ క్క సీటు కూడా దక్కలేదు.
ఎమ్మిగనూరు మండలంలో గుడికల్ మూడవ ఎంపిటిసి స్థానంలో టిడిపి జె ఎస్ పి పొత్తును పాటించక పోవడం తో అక్కడ వైసిపి గెలుపు దారులు వేశారు.
A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా