పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
సూర్య జగిత్యాల ప్రతినిధి: పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు అనుగంధుల శంకరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.నూతన గృహంలో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించి, శంకరమ్మ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ అధికారి భాస్కర్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.