కొండపల్కలలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
మండలంలోని కొండపల్కల గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. గ్రామశాఖ అధ్యక్షుడు మట్టేపెల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షుడు మట్టేపెల్లి ఆంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే శ్రమిస్తున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజా రంజక పాలనను అందిస్తున్నారని చెప్పారు. కొండపల్కల గ్రామాభివృద్ధికి ముఖ్యమంత్రి సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ఆకాంక్షించారు.రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మానకొండూర్ సింగిల్ విండో చైర్మన్ నాగిశెట్టి రాజయ్య, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మాడ తిరుపతి రెడ్డి,మండల మహిళా అధ్యక్షురాలు దూలం దేవేంద్ర, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దూలం వీరస్వామి, కొత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మహిళా గ్రామశాఖ అధ్యక్షురాలు మందల రమ, ఎస్సి సెల్ అధ్యక్షుడు యాసర్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొలిపాక మొగిలి,బండి సమ్మయ్య, కాటం కనకయ్య, గట్టు రవి,బొల్లం శ్రీనివాస్, బొడ్డు సాయిలు,తదితరులు పాల్గొన్నారు..