BREAKING
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కొండపల్కలలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు... అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం వికసించని కమలం.. పగిలిన గ్లాసు మెరుగైన వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెద్దకల్వలలో ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు మా ప్రభుత్వ శక్తి మహిళా శక్తే.. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఆహార కల్తీపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా: ₹81.8 కోట్ల సరుకు సీజ్ సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అల్ఫోర్స్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు లక్నో వెళ్లే ఇండిగో విమానానికి హైజాక్ బెదిరింపు: బెంగళూరుకు వాపస్ భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు

పెద్దకల్వలలో ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

Select Suryaa Now
పెద్దకల్వలలో ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

సూర్య - పెద్దపల్లి రూరల్ : మండలంలోని పెద్దకల్వల గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు ఒకచోట చేరి కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు కారెంగుల రమేష్, శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ అర్కుటి సంతోష్, వార్డు సభ్యులు చెవుల తిరుపతి, కళ్యాణ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓడ్నాల రమేష్, దేవనంది సదయ్య, సలేంద్ర రవి, పర్ శంకరయ్య , కోట మధునయ్య, ఉప్పు సతీష్, ఉప్పు శ్రీనివాస్స,దయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.