BREAKING
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కొండపల్కలలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు... అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం వికసించని కమలం.. పగిలిన గ్లాసు మెరుగైన వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెద్దకల్వలలో ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు మా ప్రభుత్వ శక్తి మహిళా శక్తే.. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఆహార కల్తీపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా: ₹81.8 కోట్ల సరుకు సీజ్ సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అల్ఫోర్స్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు లక్నో వెళ్లే ఇండిగో విమానానికి హైజాక్ బెదిరింపు: బెంగళూరుకు వాపస్ భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు

సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

వికారాబాద్, మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను వికారాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య ఆదేశాల మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏ బ్లాక్ నాయకుడు అనంతరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు నరసింహులు, ఎం.డి. వహీద్ మియా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సామ రామచంద్రారెడ్డి, నాయకులు, కౌన్సిలర్లు పుష్పలత శ్రీకాంత్, బాదం అనురాధ అశోక్, కాకి విజయలక్ష్మి నాగరాజు, వినోద్ కుమార్, రామకృష్ణారెడ్డి, రాకేష్, వి. రాఘవేందర్, సుధాకర్, అనంతరెడ్డి, మల్లికార్జున గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, చిగులపల్లి రమేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ మురళి, వేణుగోపాల్ రెడ్డి, జంగయ్య, నరసింహులు, నాగేష్, ప్రమోద్, పరశురాం నాయక్, వెంకట్ రెడ్డి, పి. విజయ్ కుమార్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి నాయక్, సోషల్ మీడియా ప్రతినిధి నందు, రాజు, శ్రీకాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం. సురేష్, బాలరాజు, శ్రీనివాస్, సిద్ధార్థ రెడ్డి, బీరయ్య, రాము, శంకర్, రమేష్ నాయక్, బుచ్చిబాబు గౌడ్, రాజేష్ తదితరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.