మెరుగైన వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మెరుగైన వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మునుగోడు,మేజర్ న్యూస్:మండలంలోని పలివెల గ్రామానికి చెందిన బత్తుల లింగయ్య ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మెరుగైన వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు.అట్టి ఎల్ఓసీని కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు అనగంటీ కృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆపద సమయంలో స్పందించి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, తమకు అండగా నిలిచిన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.