ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు...
సూర్య - పెద్దపల్లి రూరల్: మండలం లోని కొత్తపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు జన్మదిన వేడుకలను గ్రామ సర్పంచ్ పెర్క రిబ్కా-సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజల ఆశీర్వాదాలతో వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శిలారపు శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ కలవేన సంపత్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎండీ సుకూర్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎంచర్ల తిరుమలేష్, యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చాట్ల నరేష్, వార్డు సభ్యులు సూరంపల్లి అజయ్, కలవేన సతీష్, పెర్క నాగరాజు, తాటిపాముల సందీప్, చల్లూరి వంశీ, చాట్ల సతీష్, బాలకృష్ణ, అజయ్, తిరుపతి, జోగు రాజయ్య, శిలారపు అనిల్, కలవేన రాజు, మెట్టు సతీష్, పిల్లి సంజీవ్, వెంకటేష్, శ్రీధర్, అరవింద్, జోగు మల్లేశ్, నెత్తెట్ల మల్లేశ్, కలవేన రాజయ్య తదితరులు పాల్గొన్నారు.