BREAKING
పేదింట వెలిగిన దీపావళి దీపాలు! యూట్యూబ్ స్టార్ నాగదుర్గ ఊరమాస్ తీన్‌మార్.. ‘ఇడుపు కైథం’ మూవీ క్రేజీ అప్‌డేట్! ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు పండగ పూట ఘట్టమనేని ఇంట సందడి.. అక్క బర్త్ డే వేడుకల్లో తళుక్కుమన్న సూపర్‌స్టార్! థియేటర్లలో మళ్లీ ‘దశావతారం’ సంచలనం.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్! నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లి పీటలెక్కిన హీరోయిన్.. బిజినెస్‌మెన్‌తో గ్రాండ్ వెడ్డింగ్! జపాన్‌లో సూర్య 48 హంగామా.. దీపావళి తర్వాత మేజర్‌ షెడ్యూల్‌కు సర్వం సిద్ధం! దీపావళి సందడి..క్రాకర్స్ దుకాణాలతో కళకళ! నాగార్జున 100వ సినిమాలో పవర్‌ఫుల్ విలన్.. రూమర్స్‌కు చెక్ పెట్టిన మేకర్స్ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కొండపల్కలలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు... అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం వికసించని కమలం.. పగిలిన గ్లాసు

అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక

Select Suryaa Now
అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక

వికారాబాద్, మేజర్ న్యూస్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-16 క్రికెట్ క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపిక ప్రక్రియ ఆదివారం విజయవంతంగా ముగిసింది. తాండూరులోని సహారా క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఈ ఎంపిక పోటీలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు అజీజ్ నగర్‌లో జరగనున్న అండర్-16 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో వికారాబాద్ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసి, యువ క్రీడాకారులకు రాష్ట్రస్థాయిలో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ చేపట్టిందని కోచ్‌లు జగన్నాథ్ రెడ్డి, సతీష్, అజిత్ సింగ్, అమిత్, జిల్లా టీసీఏ కార్యదర్శి శరత్ సింగ్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.