ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు
ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు
కందుకూరు: కందుకూరు మండలం కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల మధ్య దీపావళి పండుగ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన చదువుల శ్రీనివాస్, కొరివి యశోద, గఫూర్ నగర్‌లో ఈర్లపల్లి శ్యామల, మర్రి లత ఇళ్ల వద్ద ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండల కృష్ణ, ఉపసర్పంచ్ సత్తార్ రవికుమార్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ఏఈఓ, పంచాయతీ కార్యదర్శి జానకిరామ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పాశం శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పెరుమాళ్ల శేఖర్, మీగడ యాదగిరి, అందుగుల శంఘర్, వార్డు సభ్యురాలు పోతుగంటి సుజాత, మీగడి రాధిక, మహేశ్వరం నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అందుగుల ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్