ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు
సూర్య , చింతలమానేపల్లి : మండలంలోని కార్జెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగను పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ చౌదరి నారాయణ, ఉపసర్పంచ్, కార్యదర్శి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకలు జరుపుకున్నారు. నూతన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.