వత్సవాయిలో దీపావళి సందడి.. టపాసుల కొనుగోళ్లతో కిటకిటలాడుతున్న దుకాణాలు
వత్సవాయి మండలంలో దీపావళి పండుగ సందడి నెలకొంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో టపాసుల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా టపాసుల దుకాణాలకు చేరుకుని వివిధ రకాల బాణసంచా కొనుగోలు చేస్తున్నారు.
అయితే ఈ ఏడాది టపాసుల ధరలు అధికంగా ఉండటంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ధరలు గణనీయంగా పెరిగాయని, సామాన్యులకు టపాసుల కొనుగోలు భారంగా మారిందని వాపోతున్నారు. ధరలు పెరిగినా పండుగ ఆనందం కోసం తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా వత్సవాయిలో దీపావళి పండుగ సందడి ముందుగానే కనిపిస్తోంది.