కూటమి జడ్పీటీసీ అభ్యర్థి లక్ష్మీ దేవమ్మ 4600 ఓట్లు భారీ మెజారిటీతో ఘన విజయం
కూటమి జడ్పీటీసీ అభ్యర్థి లక్ష్మీ దేవమ్మ 4600 ఓట్లు భారీ మెజారిటీతో ఘన విజయం
కార్యకర్తల కష్టానికి దక్కిన ఫలితం.. మండల అభివృద్ధికి కృషి చేస్తా: సురేష్
గుడిబండ మండలంలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి లక్ష్మీ దేవమ్మ 4,600 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా లక్ష్మీ దేవమ్మ తరఫున ఆమె తనయుడు సురేష్ విజయం . గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, డాక్టర్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాసమూర్తి చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ విజయం కేవలం అభ్యర్థులది మాత్రమే కాదని, ఎన్నికల ప్రచారంలో నిరంతరం శ్రమించిన ప్రతి ఒక్క కూటమి కార్యకర్త, నాయకుడిదని కొనియాడారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయడం వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కూటమి సత్తా ఏమిటో నిరూపించామని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం లక్ష్మీ దేవమ్మ తనయుడు సురేష్ మాట్లాడుతూ గుడిబండ మండల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి తమపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని అన్నారు.మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గుడిబండ మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని సురేష్ హామీ ఇచ్చారు.