BREAKING
ముంబైలో ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన ప్రముఖ సింగర్ సోనూ నిగమ్: ధర రూ.44.30 కోట్లు వత్సవాయిలో దీపావళి సందడి.. టపాసుల కొనుగోళ్లతో కిటకిటలాడుతున్న దుకాణాలు లోకేశ్వరం మండలం కాండ్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు. : దీపావళి సర్ప్రైజ్ ఇచ్చిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్: మొదటిసారి బాబు విహాన్ ఫొటో షేర్ చేసిన జంట దీపావళి వేళ అభిమానులకు క్షమాపణలు కోరిన అమితాబ్ బచ్చన్: చేతి నొప్పితో లేఖలు రాయడంలో ఇబ్బందులు వెల్టూర్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి పైర్ చిత్రంలో నటనానుభవం లేని వృద్ధులకు అవకాశం: దర్శకుడు వినోద్ కప్రి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విశేషాలు మంచిర్యాలలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దీపావళి వేళ చెన్నైలో కోలాహలం: అభిమానులను పలకరించిన సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు శ్రీరామనగరంలో భక్తి పారవశ్యం: చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర వేడుకల్లో పాల్గొన్న జూపల్లి రామేశ్వరరావు రజనీకాంత్ 'ధర్మన్‌'లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్‌ పోతినేని.. అరిచిపోయే యాటిట్యూడ్‌తో గ్రాండ్ వెల్కమ్ ప్రజాసేవలో సిఎం రేవంత్ రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు దీపావళి పండుగ వేళ ప్రతి ఇంట ఆనందం వెళ్లివిరియాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.కే బాషా సుమంత్ ప్రభాస్ 'బబ్లూ XXL' నుంచి మ్యాజికల్ ఫస్ట్ స్పార్క్ విడుదల.. యూత్‌ను ఆకట్టుకునేలా రొమాంటిక్ ఎంటర్‌టైనర్

'రామాయణ' మూవీ లీక్డ్ వీడియోలపై మేకర్స్ ఫైర్.. క్రిమినల్ కేసులు, కోర్టు ఉల్లంఘన చర్యల హెచ్చరిక!

Select Suryaa Now
'రామాయణ' మూవీ లీక్డ్ వీడియోలపై మేకర్స్ ఫైర్.. క్రిమినల్ కేసులు, కోర్టు ఉల్లంఘన చర్యల హెచ్చరిక!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సై పల్లవి మరియు రోకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం రామాయణ. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇటీవల కొన్ని కీలకమైన ఫైట్ సీన్లు, పిక్స్ సోషల్ మీడియాలో లీక్ కావడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ ఈ అక్రమ లీకులపై అత్యంత కఠినంగా స్పందిస్తూ ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. అనుమతి లేకుండా దృశ్యాలను రికార్డు చేసినా లేదా నెట్టింట షేర్ చేసినా క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది.

సినిమాకు సంబంధించిన ఏ చిన్న దృశ్యాన్నైనా థియేటర్లలో లేదా సెట్స్‌లో రికార్డ్ చేయడం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయడం తీవ్రమైన నేరమని మేకర్స్ స్పష్టం చేశారు. బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉదహరిస్తూ, కాపీరైట్ చట్టం 1957, సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, భారతీయ నవ సంహిత 2023 మరియు ఐటీ చట్టం 2000 నిబంధనల ప్రకారం ఇది కాపీరైట్ ఉల్లంఘనే కాకుండా కోర్టు దిక్కార నేరం కిందకు వస్తుందని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే నేరుగా క్రిమినల్, సివిల్ మరియు కోర్టు ఉల్లంఘన పిటిషన్లు దాఖలు చేస్తామని హెచ్చరించారు.

ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్న లీక్డ్ వీడియోలను తక్షణమే తొలగించాలని చిత్ర యూనిట్ నెటిజన్లను, వివిధ ఖాతాల నిర్వాహకులను ఆదేశించింది. ముఖ్యంగా లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన అనంతరం వచ్చే రాక్షసుల పోరాట ఘట్టానికి సంబంధించిన సుదీర్ఘమైన విజువల్స్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంపై చిత్ర బృందం తీవ్ర ఆగ్రహంతో ఉంది. కోట్ల రూపాయల బడ్జెట్, వేలాది మంది సాంకేతిక నిపుణుల కష్టం దాగి ఉన్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ విజువల్స్ లీక్ కావడం పట్ల నిర్మాతలు నమిత్ మల్హోత్రా తో పాటు చిత్ర బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుతం లీక్ అయిన క్లిప్పులను డిలీట్ చేయించేందుకు గూగుల్, మెటా, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో లీగల్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. పైరసీ మరియు అక్రమ రికార్డింగ్‌లను అరికట్టేందుకు చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మేకర్స్ పునరుద్ఘాటించారు. నవంబర్ 2026 నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి సంబంధించిన విజువల్స్ మరియు కంటెంట్ గోప్యతను కాపాడేందుకు చిత్ర యూనిట్ తీసుకున్న ఈ ఘాటు నిర్ణయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.