BREAKING
ముంబై కేఈఎం ఆస్పత్రి వైద్యుల అద్భుతం..కేవలం 700 గ్రాముల ప్రసవ శిశువుకు పునర్జన్మ ఉత్కంఠ పోరులో భారత్‌పై పాకిస్తాన్ విజయం, అర్జున్ రాజ్పుత్ శతకం వృథా వెస్టిండీస్ బ్యాటర్ కెవిన్ విక్రమ్ అరుదైన రికార్డు: 48 ఏళ్ల తర్వాత పునరావృతమైన చారిత్రాత్మక ఘనత బంగ్లాదేశ్ వాణిజ్య లోటు 31 శాతం దూసుకెళ్లింది వెస్టిండీస్ భారీ ఆధిక్యం: అద్భుత శతకంతో చెలరేగిన కెవెం హాడ్జెస్ కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. 4.5 లక్షల కొత్త పింఛన్లు మంజూరు : సీఎం రేవంత్ రెడ్డి బంగ్లాదేశ్ వస్త్ర రంగ కార్మికులపై తీవ్ర ప్రభావం: నివేదిక అండర్-19 ఆసియా కప్: సెంచరీతో పోరాడిన అర్జున్ రాజ్‌పుత్.. పాకిస్థాన్ చేతిలో భారత్‌కు ఓటమి పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు బస్తర్‌లో దీపావళి వేడుకలు, శాంతి, శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచాయన్న స్థానికులు నవకాంతుల ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు పోలాండ్‌లోని క్రాకో నగరంలో ఘోర కాల్పుల ఘటన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ నుంచి తప్పుకున్న రజత్ పాటిదార్: జట్టులోకి ఆయుష్ బదోని ఎంట్రీ న్యూజిలాండ్‌కు చెత్త రికార్డు: భారత్ చేతిలో ఓటమితో 21 ఏళ్ల నాటి రికార్డు బద్దలు టర్ఫ్‌పై జారిపడిన ఓపెనర్: గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన షాద్‌మాన్ ఇస్లాం

మంచిర్యాలలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
మంచిర్యాలలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

సూర్య మంచిర్యాల: OUJAC & TS JAC నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా OUJAC & TS JAC వైస్ చైర్మన్ చిప్పకుర్తి రాజు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సేవలను ప్రభుత్వం గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించాలని డాక్టర్ పిడమర్తి రవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు.ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతో పాటు 250 గజాల ఇంటి స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.ఈ విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో OUJAC & TS JAC వైస్ చైర్మన్ చిప్పకుర్తి రాజు, నేతకాని విద్యార్థి సంఘం నాయకులు జుమ్మిడి గోపాల్,ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు సుందిళ్ల సతీష్, సాయికుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.