ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు
సూర్య, జన్నారం : జన్నారం మండలం పొనకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, ఉప సర్పంచ్ అప్పాల జలపతి, కార్యదర్శి రేగొండి రాహుల్ మరియు వార్డు సభ్యులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు బాణసంచా కాల్చి దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
అనంతరం లబ్ధిదారులైన ఐలవేని సత్య, నర్సయ్యలు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శిని శాలువాలతో సత్కరించారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల చేత కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.