వాల్మీకి సంఘం కమిటి హాలు నిర్మాణానికి ఎంపీ నిధులు
పాలమూరు మేజర్ న్యూస్ -
పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఎంపీ నిధులు 10 లక్షలు మంజూరు పత్రాన్ని ఈరోజు బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా గాజులపేట వాల్మీకి సంఘం నాయకులకు అందజేశారు.పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ మంచి ఉద్దేశంతో గ్రామానికి తన సొంత నిధులు రూ 10 లక్షలు కేటాయించింది .వాటిని త్వరితగతిన పని పూర్తి చేసి అందరికీ ఉపయోగపడే విధంగా కమిటీ హాలు నిర్మించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి వాల్మీకి సంఘం పెద్దలకు సూచించారు.గ్రామానికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తమ సొంత నిధులు 10 లక్షలు కేటాయించి నందుకు వాల్మీకి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రధాని మోడీ సారథ్యంలో పాలమూరు పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతినిత్యం పార్లమెంటు పరిధిలోని ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ గారికి ఎప్పటికీ మేము అండగా ఉంటాము అంటూ వాల్మీకి సంఘం నాయకులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిని రమేష్ కుమార్, సీనియర్ నాయకులు పడకుల సత్యం ,పాలమూరు రూరల్ మండల అధ్యక్షులు బొంగు గంగన్న, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ కే సతీష్ కుమార్ జిల్లా ఆఫీసు ఇన్చార్జి జాజం సుబ్రహ్మణ్యం , గాజులపేట బిజెపి 2వ వార్డు నెంబర్ కె రవికుమార్ , తెలంగాణ వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీర నరసింహులు, తెలంగాణ వాల్మీకి సంఘం పాలమూరు పట్టణ యువసేన అధ్యక్షులు అంజన్ కుమార్ ,వాల్మీకి సంఘం నాయకులు బాయి కాడి వెంకటయ్య , ఎం. యాదయ్య,బి. శ్రీని వాసులు, బి.కుర్మయ్య ,బి అశోక్ కుమార్, బి రామాంజనేయులు, ఎం .రవికుమార్, బి .రాజేష్, బి. శ్రీనివాసులు ,బి. ఆంజనేయులు, బి. నర్సింలు, కే మైబు తదితరులు పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్,మహబూబ్ nagar