ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు..
• అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
- మేయర్ దర్ని మధుకర్
సూర్య, మంచిర్యాల :
ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
దీపావళి పండుగను పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్‌లో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు జిల్లా హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ దర్ని మధుకర్, జిల్లా హౌసింగ్ పీడీ బన్సీలాల్ పాల్గొన్నారు. లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కృషితో తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. సొంతింటి కల నెరవేరి, తమ ఇంట్లోనే దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మేయర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంతింటి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి వారి ఇళ్లలో దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ ఏఈలు ప్రశాంతి, సలోమి రాణి, చందూలాల్, మున్సిపల్ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.