BREAKING
పెద్దకల్వలలో ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు మా ప్రభుత్వ శక్తి మహిళా శక్తే.. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఆహార కల్తీపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా: ₹81.8 కోట్ల సరుకు సీజ్ సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అల్ఫోర్స్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు లక్నో వెళ్లే ఇండిగో విమానానికి హైజాక్ బెదిరింపు: బెంగళూరుకు వాపస్ భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన మాదాపురం నూతన ఎంపీటీసీ గంగాదేవి మురళి!! CBI, EDలకు ఇచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ అధికారులకు ఆధారాలతో స్టేట్‌మెంట్ ఇచ్చిన బండారి శేఖర్ సంవత్ 2083లో మార్కెట్ దిగ్గజాల పెట్టుబడి వ్యూహాలు కేంద్రమంత్రికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ బీజేపీ కార్పొరేటర్ వేధింపులతోనే కల్లేపల్లి శివ ఆత్మహత్యాయత్నం! సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల నిరుపేద విద్యార్థి వైద్య విద్యాబ్యాసానికి తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం Rs.50,016/- ఆర్థిక సహాయం

17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా.....

Select Suryaa Now
17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా.....

పరిగి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రశాంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన పరిగి ఎస్‌ఐ ఈ. రవికుమార్‌కు ఆదివారం పలువురు ఎంపీటీసీలు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ఎక్కడా చిన్నపాటి గొడవలు, అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్‌ఐ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించారు. గ్రామాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించి ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు.ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఫలితాల అనంతరం కూడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు బందోబస్తును కొనసాగించడం అభినందనీయమని ఎంపీటీసీలు పేర్కొన్నారు.ఈ సందర్భంగా శిరికోళం ఎంపీటీసీ రాజగోపాల్ కాపుసెట్ల సంజీవరాయప్ప, బీజేపీకి చెందిన చంద్రశేఖర్ ఆనంద్ తదితర ఎంపీటీసీలు ఎస్‌ఐ రవికుమార్‌ను అభినందించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల నిర్వహణలో గెలుపోటములు రాజకీయ పార్టీలకు సంబంధించినవైతే.. ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రశాంతంగా ముగియడం పోలీసుల సమర్థవంతమైన విధి నిర్వహణకు నిదర్శనమని వారు ప్రశంసించారు.

 పరిగి సూర్య రిపోర్టర్ నవీన్…..