కేంద్రమంత్రికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్
సూర్య కరీంనగర్ :దీపావళి పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పూల మొక్కను అందజేసి, హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో వెలుగులు నింపే ఈ దివ్య దీపావళి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.