BREAKING
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కొండపల్కలలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు... అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం వికసించని కమలం.. పగిలిన గ్లాసు మెరుగైన వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెద్దకల్వలలో ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు మా ప్రభుత్వ శక్తి మహిళా శక్తే.. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఆహార కల్తీపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా: ₹81.8 కోట్ల సరుకు సీజ్ సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అల్ఫోర్స్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు లక్నో వెళ్లే ఇండిగో విమానానికి హైజాక్ బెదిరింపు: బెంగళూరుకు వాపస్ భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు

బీజేపీ కార్పొరేటర్ వేధింపులతోనే కల్లేపల్లి శివ ఆత్మహత్యాయత్నం!

Select Suryaa Now
బీజేపీ కార్పొరేటర్ వేధింపులతోనే కల్లేపల్లి శివ ఆత్మహత్యాయత్నం!

సూర్య కరీంనగర్: కిసాన్ నగర్ ప్రాంతానికి చెందిన కల్లేపల్లి శివ అనే వికలాంగుడు బీజేపీ కార్పొరేటర్ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం కరీంనగర్ నగరంలోని వజ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివను ఆదివారం ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పదేళ్ల పాలనలో నగరాన్ని అభివృద్ధి చేశాం

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లామని, గతంలో ఎన్నడూ జరగని రీతిలో రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనతో నగర రూపురేఖలను మార్చామని గంగుల పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న నేపథ్యంలో కరీంనగర్ మరింత అభివృద్ధి చెందుతుందని, కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆశించామని అన్నారు. అయితే అభివృద్ధి మాట అటుంచి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితులు నెలకొనడం బాధాకరమని విమర్శించారు.

వికలాంగుడైన శివ కుటుంబాన్ని భయపెట్టడం దారుణం

కల్లేపల్లి శివ రెండు కాళ్లు పనిచేయని వికలాంగుడని, ఆయన తండ్రి జీవితకాలం ఆర్ఎస్ఎస్‌లో పనిచేసిన వ్యక్తి అని గంగుల తెలిపారు. సుమారు పది నుంచి పదిహేనేళ్ల క్రితం కిసాన్ నగర్‌లో నిర్మించుకున్న వారి ఇంటిలో రోడ్డు విస్తరణ సమయంలో కొంత భాగం తొలగించారని, మిగిలిన ఇంటిలో శివ నివసిస్తున్నాడని వివరించారు.

ఇల్లు నిర్మించాలంటేనే ప్రజలు భయపడుతున్నారు

కరీంనగర్ నగరంలో కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారని తెలిస్తే బీజేపీ పాలకవర్గ సభ్యులు గద్దల్లా వాలిపోతున్నారని ఆరోపించారు. నోటీసుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రజలు ప్రశాంతంగా తమ ఇళ్లను నిర్మించుకునే వాతావరణం కల్పించాలని, ఇలాంటి వేధింపులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.

ఆత్మహత్యాయత్నం బాధాకరం.. ప్రాణాలు కాపాడటం ముఖ్యం

ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన శివ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని గంగుల తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. ముందుగా శివ ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా వైద్య చికిత్స ప్రారంభించామని, వైద్యుల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన 90 శాతం ప్రమాదం నుంచి బయటపడ్డారని వెల్లడించారు.

ప్రజలు భయపడొద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటుంది

కరీంనగర్ ప్రజలకు గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేస్తూ.. నోటీసుల పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడవద్దని, చట్టపరంగా ఎదుర్కోవాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసినా, ఇళ్లను కూల్చివేస్తామని బెదిరించినా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల ఆస్తులను, ప్రాణాలను కాపాడేందుకు పార్టీ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

బండి సంజయ్ వెంటనే స్పందించాలి

కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను ఉద్దేశించి గంగుల మాట్లాడుతూ.. ఇటీవల ఇటువంటి వేధింపులను సహించేది లేదని ప్రకటించిన మీరు, ఇప్పుడు మీ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల పరిధిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, సీపీ స్పందించాలి

మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలని గంగుల కోరారు. శివ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన వారు ఎవరు? ఏ ప్రాతిపదికన నోటీసులు జారీ చేశారు? వాటి వెనుక ఎవరి ప్రమేయం ఉంది? అనే అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా నోటీసులు జారీ చేస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ప్రజల తరఫున పోరాటం చేస్తామని ప్రకటించారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా.. వైద్య ఖర్చులన్నీ నేనే భరిస్తా.. బాధితునికి ఎలక్టికల్ స్కూటర్  కొనిస్తా...

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్లేపల్లి శివను గంగుల కమలాకర్ స్వయంగా పరామర్శించి ఆప్యాయంగా మాట్లాడారు. శివ ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకుంటూ ధైర్యంగా ఉండాలని, అధైర్యపడకుండా సమస్యలపై పోరాడాలని సూచించారు. అనంతరం వైద్యులను కలిసి శివ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి ఆర్థిక సహాయం అందించారు. శివ పూర్తిగా కోలుకునే వరకు చికిత్సకు సంబంధించిన పూర్తి ఖర్చును తానే భరిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీతో పాటు తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మండల శాఖ అధ్యక్షులు. డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.