మూడు విడతల్లో ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: పూర్తి షెడ్యూల్ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 13,354 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల కానుండగా, నామినేషన్లకు ఈ నెల 17 వరకు గడువు ఇచ్చారు. ఈ విడత పోలింగ్ ఈ నెల 26న ఉదయం జరగనుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.
అలాగే రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 16న విడుదల కానుండగా, నామినేషన్లకు ఈ నెల 20 వరకు గడువు ఉంటుంది. ఈ విడత పోలింగ్, ఫలితాల ప్రకటన ఈ నెల 29న చేపట్టనున్నారు. ఇక మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ల దాఖలుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.