గొట్టిపాటి లక్ష్మి నాయకత్వం పై ప్రజల విశ్వాసం
గొట్టిపాటి లక్ష్మీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం.
ఐదింటికి ఐదు జడ్పీటీసీ, 73కి 72 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి గెలుపు.
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులను కలిసి కృతజ్ఞతలు తెలిపిన విజేతలు.
అభివృద్ధి పయనం ఆగకూడదు: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
సూర్య న్యూస్ దర్శి.
దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ నాయకత్వంలో దర్శి నియోజకవర్గంలో కూటమి మరోసారి తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయదుందుభి మోగించారు. ఐదు జడ్పీటీసీ స్థానాలనూ 5 కూటమి క్లీన్‌స్వీప్ చేయగా, 73 ఎంపీటీసీ స్థానాల్లో 72 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఏ ఎన్నికైనా ప్రజల తీర్పు కూటమి వైపే అనిగొట్టిపాటి లక్ష్మీ నాయకత్వానికి తిరుగులేదని ఈ ఫలితాలు మరోసారి స్పష్టం చేశాయి.
ఘన విజయం సాధించిన కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు తమ డిక్లరేషన్ ఫామ్‌లతో నరసరావుపేట లోని టీడీపి కార్యాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులను కలిశారు. తమ గెలుపునకు అండగా నిలిచి, ఎన్నికల సమయంలో అడుగడుగునా సహకారం అందించినందుకు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కి, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కి, టిడిపి సీనియర్ నాయకులు కడియాల రమేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విజేతలకు గొట్టిపాటి లక్ష్మీ దంపతుల అభినందనలు తెలియజేశారు.