పంచాయితీ ఎన్నికలకు గుర్తులు సిద్ధం
పంచాయితీ ఎన్నికలకు గుర్తులు సిద్ధం
సత్తెనపల్లి, మేజర్ న్యూస్ :
ఈ నెల 26, 29, డిసెంబరు 2వ తేదీల్లో పంచాయతీలకు ఎన్ని కలు నిర్వహించేందుకు ఎస్ఈసీ చర్యలు తీసుకుంటోంది.ఇందులో భాగంగా సర్పంచి అభ్యర్థుల కోసం 25, వార్డు సభ్యుల కోసం 20 చొప్పున గుర్తులు కేటాయించారు. వీటికి అదనంగా నోటా ఉండ నుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగితే కొత్త గుర్తులు కేటాయిం చనున్నారు. సర్పంచి అభ్యర్థులకు మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పూ సాసరు, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా గుర్తులు కేటాయించనున్నారు. వార్డు సభ్యులకు ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్త్రీపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్ స్టౌ, బీరువా, ఐస్క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయో లిన్, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులు ఇవ్వనున్నారు.
గన్నవరం ఏలియ, సత్తెనపల్లి ఇన్ఛార్జ్