కొడంగల్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కొడంగల్, మేజర్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తన పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొడంగల్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో సాదాసీదాగా, ఆత్మీయ వాతావరణంలో సీఎం తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.