దీపావళి పండుగ వేళ ప్రతి ఇంట ఆనంద హేళ : వైకాపా మహిళా నేత బుసిరెడ్డి శారదా రెడ్డి హర్షం
మదనపల్లి,మేజర్ న్యూస్ : దీపావళి పండుగ వేళ ప్రతి ఇంట ఆనంద సంబరాలు నెలకొన్నాయని వైఎస్ఆర్సిపి మహిళ నేత,మునిసిపల్ మాజీ కో-ఆప్షన్ సభ్యులు బుసిరెడ్డి శారదా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ భారతీయ ఆచార,సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శనమన్నారు.భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనమని,ఇక్కడ అనేక మతాల వారు వారి ఆచార,సాంప్రదాయల మేరకు పండుగలని నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు.మదనపల్లిలో అన్ని మతాలవారు కలసిమెలిసి పర్వదినాలను నిర్వహిస్తూ మతసామరస్యాన్ని చాటుతున్నారన్నారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,మాజీ మంత్రి పెద్దిరెడ్డి,ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,మదనపల్లి సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వరపన మనూజ రెడ్డి,నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి