BREAKING
వాల్మీకి సంఘం కమిటి హాలు నిర్మాణానికి ఎంపీ నిధులు బాక్సాఫీస్ వద్ద సూర్య రికార్డుల మోత.. కేవలం రెండు రోజుల్లోనే 80 కోట్ల వసూళ్లు! నా నటనపై శ్రీదేవి మొదట్లో సందేహించారు.. ముక్కు సర్జరీ తర్వాతే అమ్మలో ఆ ఆలోచనొచ్చింది: జాన్వీ కపూర్ *పిడుగురాళ్లలో బాణసంచా యాజమాన్యాల దోపిడీ - నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు?* *మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం ఉందన్న ప్రజల ఆరోపణ - పేదవాడి జేబుకు చిల్లు* *పిడుగురాళ్ల:* దీపావళి పండుగ వస్తే చాలు పేదవాడికి పండుగ కాదు, భారం. నరకాసుడిని చంపిన దీపావళిని మనం ఆనందంగా చేసుకుంటే, ఒక్క బాణసంచా కొనలేని స్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు బస్తర్‌లో మోదీ దీపావళి సంబరాలు: నక్సలిజం ఏరివేతతో అభివృద్ధికి కొత్త బాటలు 'రామాయణ' మూవీ లీక్డ్ వీడియోలపై మేకర్స్ ఫైర్.. క్రిమినల్ కేసులు, కోర్టు ఉల్లంఘన చర్యల హెచ్చరిక! కేఫ్ సెంటర్లలో .. సిగరెట్ ప్రియం ప్రియం దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్‌పై ఆంక్షలు.. ఆ నాలుగు పాటలపై నిషేధం! ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు కేవలం గంట వ్యవధిలోనే ‘రామాయణ’ సాంగ్ నేర్చుకున్నా.. సింగర్ చిన్మయి ఆసక్తికర వ్యాఖ్యలు! ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు.. 'రామాయణ' సెట్స్ నుంచి అన్‌సీన్ పిక్స్ లీక్.. రణ్‌బీర్ కపూర్‌పై స్టంట్ డబుల్ సంచలన వ్యాఖ్యలు! తమిళ చిత్రాల్లో నటించడంపై జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కోలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు*కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపినఎమ్మెల్యేమట్టా రాగమయి, రాష్ట్ర నాయకుల మట్టా దయానంద్ విజయ్ కుమార్*

కూసుమంచిలో మహేంద్రమ్మ ఇంట్లో దీపాలు వేడుకలు మా ఇంట్లో దీపాలు వేడుకలు

Select Suryaa Now
కూసుమంచిలో మహేంద్రమ్మ ఇంట్లో దీపాలు వేడుకలు మా ఇంట్లో దీపాలు వేడుకలు

సూర్య,ఖమ్మం/కూసుమంచి,రాష్ట్రవ్యాప్తంగా పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో మంజూరు చేసిన ఇళ్లలో సుమారు 2 లక్షల 21 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పాల్గొని, లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి డివిజన్, వార్డు, గ్రామం, మండలం, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామన్నారు ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలుకొని వార్డు సభ్యుల వరకు అందరి భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. 

పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు ఉండాలనేది ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి అన్నారు. పేద ఇంటి ఆడబిడ్డలు కోరుకున్న విధంగా రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ. 40,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించామన్నారు. ఒక్కో లబ్ధిదారునికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ ఇళ్లను నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 

రాబోయే రోజుల్లో 3వ విడత, 4వ విడతల్లో కూడా అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లను అందజేస్తామని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, పేదవాడిని అర్హతే ప్రామాణికంగా అందరికీ ఇళ్లు మంజూరు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, రాష్ట్ర ప్రజలందరికీ నా తరఫున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి టీ. సునీల్ రెడ్డి, మండల తహశీల్దార్ సైదులు, ఎంపీడీవో జశ్వంత్ కుమార్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సూర్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ