BREAKING
సుమంత్ ప్రభాస్ 'బబ్లూ XXL' నుంచి మ్యాజికల్ ఫస్ట్ స్పార్క్ విడుదల.. యూత్‌ను ఆకట్టుకునేలా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు.. కడ్తాల్‌లో ఘనంగామా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి వేడుక” మండలంలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పేద కుటుంబంలో ఆనందాల వెలుగులు నవాబుపేటలో ప్రారంభమైన వెంకటేశ్వర దాబా.. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య నిశ్చితార్థం తర్వాత కాబోయే భార్యతో తొలి ఫోటో.. సాయి దుర్గా తేజ్ రొమాంటిక్ పోస్ట్ వైరల్! గోదావరి పుష్కర ఘాట్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సాగరన్న ప్రత్యేక పర్యవేక్షణ 'రామాయణ'లో లక్ష్మణుడి పాత్రపై భార్య సర్గున్ మెహతా భావోద్వేగం.. రవి దూబే నటనకు ఫిదా! దీపావళి వేడుకల్లో ఆత్మీయ కలయిక.. హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన కాల్వగడ్డ రాజ్‌కుమా కేటీఆర్, కేసీఆర్‌లపై రేవంత్ రెడ్డి ఫైర్ బాక్సాఫీస్ వద్ద రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ సునామీ.. మూడు రోజుల్లోనే రూ. 375 కోట్ల వసూళ్లు! వాల్మీకి సంఘం కమిటి హాలు నిర్మాణానికి ఎంపీ నిధులు

ఇందిరమ్మ ఇంట్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దీపావళి సందడి

Select Suryaa Now
ఇందిరమ్మ ఇంట్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దీపావళి సందడి

 

కుటుంబంతో కలిసి పండుగ సంబరాలు.. పట్టుబట్టలు, స్వీట్లు,టపాకాయల పంపిణీ

రాజపేట:పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజాపేట మండలం బసంతపురం గ్రామంలోని ఓ ఇందిరమ్మ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇందిరమ్మ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు.వారికి పట్టుబట్టలు, స్వీట్లు, టపాకాయలు అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఇంట్లో ఇందిరమ్మ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వచ్చి కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోవడంతో ఇందిరమ్మ కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయన రాకతో బసంతపురంలో పండుగ సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మెండు భాస్కర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నెమిల మహేందర్‌గౌడ్, రాష్ట్ర నాయకుడు బుడిగె పెంటయ్యగౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగా నరేశ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.