దీపావళి వేడుకల్లో ఆత్మీయ కలయిక.. హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన కాల్వగడ్డ రాజ్‌కుమా
రామచంద్రాపురం ; పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వగడ్డ రాజ్‌కుమార్, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పండుగ విశిష్టతను చాటుతూ, దీపావళి వెలుగులు ప్రజలందరి జీవితాల్లో నూతన ఆశలు, ఆనందాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.ప్రజా సేవే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆత్మీయంగా శుభాకాంక్షలు పంచుకున్నారు.ప్రజా సంబంధాలు.. ఆత్మీయ అనుబంధాలు.. పండుగ వేళ ప్రత్యేక కలయికగా ఈ భేటీ నిలిచింది.