BREAKING
ప్రపంచ జూనియర్‌ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌గా భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్ వి అరుదైన విజయం అంతర్జాతీయ ఐస్‌ స్కేటింగ్‌లో అరుదైన మైలురాయిని దాటిన తెలుగు తేజం తల్లూరి నయనశ్రీ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు దుబాయ్‌లో అంబరాన్ని అంటిన దీపావళి వేడుకలు లాభాల నుంచి నష్టాల్లోకి.. ముహూర్త ట్రేడింగ్‌లో మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు చీకటిపై వెలుగుల విజయం దీపావళి, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, ఇజ్రాయెల్ శుభాకాంక్షలు దుబాయ్‌లో దేదీప్యమానంగా దీపావళి వేడుకలు, పండుగ కాంతుల్లో మెరిసిపోయిన నగరం సంవత్ 2083కి ముహూర్త ట్రేడింగ్‌లో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ శ్రీలంకలో ఘనంగా దీపావళి వేడుకలు దీపావళి పండుగ వేళ ప్రతి ఇంట ఆనంద హేళ : వైకాపా మహిళా నేత బుసిరెడ్డి శారదా రెడ్డి హర్షం ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆనంది 'గరివిడి లక్ష్మి': నవంబర్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ దీపావళి వేళ మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న హీరో శివకార్తికేయన్: ప్రత్యేక ప్రార్థనలు చేసిన కోలీవుడ్ స్టార్ ముంబైలో ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన ప్రముఖ సింగర్ సోనూ నిగమ్: ధర రూ.44.30 కోట్లు వత్సవాయిలో దీపావళి సందడి.. టపాసుల కొనుగోళ్లతో కిటకిటలాడుతున్న దుకాణాలు

నవాబుపేటలో ప్రారంభమైన వెంకటేశ్వర దాబా.. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

Select Suryaa Now
నవాబుపేటలో ప్రారంభమైన వెంకటేశ్వర దాబా.. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

నవాబుపేట, మేజర్ న్యూస్: నవాబుపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర దాబా ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి దాబాను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ… నూతనంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తూ వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. నాణ్యత, మంచి సేవలతో వినియోగదారుల మన్ననలు పొందుతూ వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.మండల కేంద్రంలో నూతనంగా వెంకటేశ్వర దాబా అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆహార సదుపాయం మరింత చేరువ కానుంది. దాబా ప్రారంభం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎత్రాజ్‌పల్లి సర్పంచ్ జగన్ రెడ్డి, ముబారక్‌పూర్ సర్పంచ్ జయయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుగారి వెంకట్ రెడ్డి, వట్టి మినపల్లి సొసైటీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగిరెడ్డి, ఆనంద్ రెడ్డి, ముబారక్‌పూర్ ఉప సర్పంచ్ రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, అభిమానులు తదితరులు పాల్గొని దాబా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.