మండలంలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కడ్తాల్ , రంగారెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని కడ్తాల్ మండల్ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు.
మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోతుగంటి శంకర్, మలే మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, టపాకాయలు, పండ్లు-స్వీట్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ - ప్రజా పాలనతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. జన్మదినం, దీపావళి సందర్భంగా రాష్ట్రంలో 4.5 లక్షల మందికి నూతన చేయూత పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, సర్పంచ్ రాయికంటి బిక్షపతి, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.