BREAKING
ప్రపంచ జూనియర్‌ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌గా భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్ వి అరుదైన విజయం అంతర్జాతీయ ఐస్‌ స్కేటింగ్‌లో అరుదైన మైలురాయిని దాటిన తెలుగు తేజం తల్లూరి నయనశ్రీ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు దుబాయ్‌లో అంబరాన్ని అంటిన దీపావళి వేడుకలు లాభాల నుంచి నష్టాల్లోకి.. ముహూర్త ట్రేడింగ్‌లో మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు చీకటిపై వెలుగుల విజయం దీపావళి, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, ఇజ్రాయెల్ శుభాకాంక్షలు దుబాయ్‌లో దేదీప్యమానంగా దీపావళి వేడుకలు, పండుగ కాంతుల్లో మెరిసిపోయిన నగరం సంవత్ 2083కి ముహూర్త ట్రేడింగ్‌లో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ శ్రీలంకలో ఘనంగా దీపావళి వేడుకలు దీపావళి పండుగ వేళ ప్రతి ఇంట ఆనంద హేళ : వైకాపా మహిళా నేత బుసిరెడ్డి శారదా రెడ్డి హర్షం ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆనంది 'గరివిడి లక్ష్మి': నవంబర్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ దీపావళి వేళ మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న హీరో శివకార్తికేయన్: ప్రత్యేక ప్రార్థనలు చేసిన కోలీవుడ్ స్టార్ ముంబైలో ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన ప్రముఖ సింగర్ సోనూ నిగమ్: ధర రూ.44.30 కోట్లు వత్సవాయిలో దీపావళి సందడి.. టపాసుల కొనుగోళ్లతో కిటకిటలాడుతున్న దుకాణాలు

గోదావరి పుష్కర ఘాట్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సాగరన్న ప్రత్యేక పర్యవేక్షణ

Select Suryaa Now
గోదావరి పుష్కర ఘాట్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సాగరన్న ప్రత్యేక పర్యవేక్షణ

• అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలకు ఆదేశాలు

సూర్య, లక్షెట్టిపేట :

రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి నది తీరంలో చేపట్టనున్న పుష్కర ఘాట్ ఏర్పాట్లపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలిసి పుష్కర ఘాట్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, చేపట్టాల్సిన ఏర్పాట్లు, పనుల పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఘాట్ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు, పారిశుధ్యం, తాగునీటి వసతి తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. భక్తుల రాకపోకలకు అనుకూలంగా ఉండేలా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ సభ్యులు అంకతి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి-వెంకటస్వామి గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు చల్లా నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.