ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పేద కుటుంబంలో ఆనందాల వెలుగులు
ఉప్పునుంతల, సూర్య న్యూస్:;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బర్ల పుష్పలత, కృష్ణయ్య దంపతుల నూతన గృహంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హాజరై, లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో దీపాలు వెలిగించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రతి పేద కుటుంబంలో ఆనందాల వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమం పేద కుటుంబాల్లో కొత్త ఆశలు, ఆనందాన్ని నింపుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చింతగల శ్రీనివాసులు, డిప్యూటీ సర్పంచ్ అంతటి శైలజ వెంకటయ్య గౌడ్, అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు కట్టా అనంతరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్నె లక్ష్మీనారాయణ, ఎస్సై పుట్ట మహేష్ గౌడ్, సీనియర్ నాయకులు తిప్పర్తి నరసింహారెడ్డి, గంగుల నరసింహారెడ్డి, ఉమామహేశ్వర దేవస్థానం డైరెక్టర్ లక్ష్మయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షుడు మడ్డి తిరుపతయ్య గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెడమోని భాస్కర్, అంతటి శేఖర్ గౌడ్, బాలయ్య, అశోక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.