ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు*కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపినఎమ్మెల్యేమట్టా రాగమయి, రాష్ట్ర నాయకుల మట్టా దయానంద్ విజయ్ కుమార్*
సూర్య,సత్తుపల్లి ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వేడుకల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అక్కడికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత మేలు చేకూర్చాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ సత్తుపల్లి మునీర్ పాష