ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు
ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు
సర్పంచ్ కేశమోని రాజు
యాచారం మేజర్ న్యూస్ ( నవంబర్ 08): ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు, మండల పరిధిలో చౌదర్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లలో, కొత్తగా నిర్మించిన మా ఇందిరా గాంధీ అని దీపావళి సంబరాలు నిర్వహించారు. ఆదివారం.. గ్రామ సర్పంచి రాజు ఇందిరమ్మ ఇంటింటికి వెళ్లి, ప్రత్యేకంగా దీపాలు వెలిగించి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదింటి ఆడపడుచులకు ఇందిరమ్మ ఇళ్లు, సొంతింటి కలగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో పేద ప్రజలు అభివృద్ధి దశలో ముందుకెళ్తున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కామాద్యక్షులు గౌర శ్రీశైలం, బొడ్రమోని రాజు, అమీర్పేట్ గణేష్, విష్ణు, నాయిని నర్సిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.