వేమారెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
మోమిన్‌పేట్,మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మోమిన్‌పేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆశీస్సులతో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేమారెడ్డి ఆధ్వర్యంలో మోమిన్‌పేట్ కొత్త బస్టాండ్ సమీపంలో నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 300 మంది కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు సంధ్య, సుభాష్ గౌడ్, శంకరప్ప, శ్రీనివాస్, లావణ్య, మోహన్, మధురవేణి, శివకుమార్, లలిత, జైపాల్, మాజీ సర్పంచ్ సురేష్, జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి మానేయ యాదవ్, మాజీ ఎంపీటీసీ మల్లేష్ యాదవ్, జాయింట్ కన్వీనర్ పడాల బాబు, మాజీ కోఆప్షన్ సభ్యుడు బాగ్ధద్, మాజీ ఉపసర్పంచ్ చౌక తల్లి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బందయ్య, కాంగ్రెస్ నాయకులు మహంత్ స్వామి, రాహుల్, రామకృష్ణారెడ్డి, రాజు, మహబూబ్ అలీ, గిరి సింగ్, ఆసిఫ్, యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్, సిజ్జు తదితరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.