BREAKING
పత్తి రైతులకు ‘క్యాష్‌ కటింగ్‌’తో నష్టం శివాజీ నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం గుండె పోటుతో వ్యక్తి మృతి ఘనంగా గజ్జె పూజా కార్యక్రమ నిర్వహణ స్టేట్ ఆడిట్ టీఎన్జీవోస్ అనుబంధ ఫోరం ఎన్నికలు ఏకగ్రీవం ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష - కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ ప్రక్షాళన "సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం". పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అంతర్జాతీయ వాణిజ్య మేళాలో ఈపీఎఫ్ఓ పెవిలియన్‌కు కాంస్య పతకం నారీ శక్తి వందన్ సవరణ నేటి తక్షణ అవసరం దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మితవాద పార్టీల జోరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు

Select Suryaa Now
పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం  విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి  మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు

నంద్యాల, నవంబరు 29: రాయలసీమలో విజయనగర సామ్రాజ్యంలోని పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు రాజకీయ, ఆర్థిక అధికారం కొద్ది కుటుంబాల చేతుల్లోనే కొనసాగుతోందని మాజీ డీజీపీ, ఆల్‌ ఇండియా బహుజన సమాజ్‌ పార్టీ జాతీయ సమన్వయకర్త డా. జె. పూర్ణచంద్రరావు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం నంద్యాలలోని జంబుల పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో కుమ్మర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కె. సుధాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన కుమ్మరుల వనసమారాధనలో ఆయన ప్రసంగించారు.

వడ్డె ఓబన్నకు దక్కని గుర్తింపు

పాలెగాళ్ల కాలంలో భూములు, సైన్యం, శిస్తు వసూళ్లు, న్యాయ నిర్ణయాధికారం స్థానిక పాలకుల చేతుల్లో ఉండేవన్నారు. బ్రిటిష్‌ పాలకులు రెవెన్యూ సంస్కరణలు చేపట్టి పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి భరణాలు నిర్ణయించారన్నారు. తన మేనమామ కుటుంబానికి సంబంధించిన భరణం కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్‌ ప్రభుత్వంతో వివాదానికి దిగారని వివరించారు. భూములు, జీవనాధారం కోల్పోతామనే ఆందోళనతో కట్టుబడిదారులు ఆయన తిరుగుబాటులో భాగస్వాములయ్యారన్నారు.

వడ్డె ఓబన్న సైనిక నాయకుడిగా కీలక పాత్ర పోషించారని, బోయలు, చెంచులు, యానాదులు తదితర సామాజిక వర్గాలు పోరాటంలో పాల్గొన్నాయని తెలిపారు. నరసింహారెడ్డి చరిత్రను భారీ సినిమాల ద్వారా వెలుగులోకి తెస్తున్నప్పటికీ వడ్డె ఓబన్న వంటి యోధులకు తగిన గుర్తింపు లభించడం లేదన్నారు.

పాలకులు మారినా పరిస్థితులు మారలేదు

బ్రిటిష్‌ పాలన ముగిసిన తరువాత నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీఆర్‌, చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి వరకు రాష్ట్ర రాజకీయాల్లో రెడ్డి, కమ్మ నాయకత్వం ప్రధానంగా కొనసాగిందన్నారు. పాలెగాళ్ల కాలంనాటి అనధికార పంచాయతీల సంస్కృతి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోందని తన పోలీసు శాఖ అనుభవాలను గుర్తుచేశారు.

కొన్ని కుటుంబాలకు రాజకీయ పదవులు వారసత్వంగా లభిస్తుంటే రజకులు, వడ్డెరలు, కుమ్మర్లు, విశ్వబ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, దూదేకులు, చెంచులు, యానాదులు, ఎరుకలు వంటి అనేక సామాజిక వర్గాలు తగిన రాజకీయ ప్రాతినిధ్యానికి నోచుకోవడం లేదన్నారు. రాజకీయ పదవులతో పాటు వ్యాపారాలు, గనులు, విద్యాసంస్థలు, ఉన్నత ఉద్యోగాల్లోనూ సామాజిక అసమానతలు ఉన్నాయని పేర్కొన్నారు.

బీసీలకు న్యాయం జరగాలి

బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయినంత మాత్రాన బీసీలందరికీ సామాజిక న్యాయం జరిగినట్లు కాదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు పది శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో బీసీలకు వర్తిస్తున్న క్రీమీలేయర్‌ నిబంధనలపై చర్చ జరగాలన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

యువత విద్యార్జనతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు జీనో ఎఫ్‌ఎం యాప్‌ ద్వారా సంగీతం, ప్రసంగాలు, సామాజిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలను అందిస్తున్నట్లు వివరించారు.

విద్యే అభివృద్ధికి పునాది

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, కుమ్మర కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, రవీంద్ర విద్యాసంస్థల చైర్మన్‌ పుల్లయ్య మాట్లాడుతూ కుమ్మరుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి విద్యే పునాది అన్నారు. పిల్లలకు ఉన్నత విద్య అందించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విద్యారంగంలో మరింత ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో కె. గురునాథ్‌, కె. రాముడు, కె. నాగభూషణం, కె. రంగస్వామి తదితరులు పాల్గొన్నా