BREAKING
సమాజ నిర్మాణంలో చేనేతల పాత్ర కీలకం : ఎమ్మెల్యే నసీర్ నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం - నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పత్తి రైతులకు ‘క్యాష్‌ కటింగ్‌’తో నష్టం శివాజీ నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం గుండె పోటుతో వ్యక్తి మృతి ఘనంగా గజ్జె పూజా కార్యక్రమ నిర్వహణ స్టేట్ ఆడిట్ టీఎన్జీవోస్ అనుబంధ ఫోరం ఎన్నికలు ఏకగ్రీవం ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష - కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ ప్రక్షాళన "సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం". పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అంతర్జాతీయ వాణిజ్య మేళాలో ఈపీఎఫ్ఓ పెవిలియన్‌కు కాంస్య పతకం నారీ శక్తి వందన్ సవరణ నేటి తక్షణ అవసరం దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం

పత్తి రైతులకు ‘క్యాష్‌ కటింగ్‌’తో నష్టం

Select Suryaa Now
పత్తి రైతులకు ‘క్యాష్‌ కటింగ్‌’తో నష్టం
సూర్య తిర్యాణి : తిర్యాణి: ఎంతో కష్టపడి పండించిన పత్తిని విక్రయించే సమయంలో మిల్లుల్లో ‘క్యాష్‌ కమిషన్‌’ పేరుతో డబ్బులు కోత విధిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి లక్ష రూపాయలకు రూ.1,500 చొప్పున కట్టింగ్‌ పెట్టడం వల్ల రైతులకు వేల రూపాయల నష్టం జరుగుతోంది.రైతు అందించిన తూకపు స్లిప్‌ ప్రకారం రూ.2,08,372 విలువైన పత్తికి ‘సీసీ చార్జీలు’ పేరుతో రూ.3,125.58 కోత విధించారు. హమాలీ, కాటా చార్జీలతో కలిపి మొత్తం రూ.3,640.48 తగ్గించి రూ.2,04,731.52 మాత్రమే చెల్లించారు. ఈ విధంగా ప్రతి రైతు నుంచి వేల రూపాయలు తగ్గిస్తే రైతులు మరింత ఆర్థికంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. పంట పండించడానికి అప్పులు చేసిన రైతులకు పత్తి విక్రయించిన తరువాత కూడా కట్టింగ్‌ల పేరుతో డబ్బులు తగ్గించడం అన్యాయమని రైతులు పేర్కొంటున్నారు.పత్తి రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో ఎలాంటి ‘క్యాష్‌ కటింగ్‌’, కమిషన్‌ లేదా ఇతర అనవసర కోతలు విధించకుండా పూర్తి మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సంబంధిత వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి, రైతులకు నష్టం కలిగించే కట్టింగ్‌లను వెంటనే నిలిపివేయాలని కోరుతున్నారు.కష్టపడి పంట పండించిన రైతు సొమ్ములో కోతలు వద్దని, పత్తి విక్రయించిన ప్రతి రూపాయినీ రైతుకే అందించి న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.