BREAKING
పత్తి రైతులకు ‘క్యాష్‌ కటింగ్‌’తో నష్టం శివాజీ నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం గుండె పోటుతో వ్యక్తి మృతి ఘనంగా గజ్జె పూజా కార్యక్రమ నిర్వహణ స్టేట్ ఆడిట్ టీఎన్జీవోస్ అనుబంధ ఫోరం ఎన్నికలు ఏకగ్రీవం ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష - కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ ప్రక్షాళన "సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం". పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అంతర్జాతీయ వాణిజ్య మేళాలో ఈపీఎఫ్ఓ పెవిలియన్‌కు కాంస్య పతకం నారీ శక్తి వందన్ సవరణ నేటి తక్షణ అవసరం దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మితవాద పార్టీల జోరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం

Select Suryaa Now
శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం
సూర్య - పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులతో జన సందోహంల మారింది. వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో  భాగంగా రథోత్సవం ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మీనృసింహస్వామినిo దర్శించుకునేందుకు భక్తులు ఆలయంలో క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.   జాతర ప్రాంగణం భక్తజనసంద్రంగా మారింది.  వివిధ మార్గాల నుండి వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహక అధికారి శంకరయ్య, సర్పంచ్ బొక్కల రేఖ సంతోష్  అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా డీసీపీ భూక్య రాంరెడ్డి సూచన మేరకు పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ నేతృత్వంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నాయిని మధుకర్, సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. రాగినేడు పీ హెచ్ సీ ఆద్వర్యంలో ఆలయ ప్రాంగణంలో వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాట్లను ఆ శాఖ అధికారులు పర్యవేక్షించారు.