BREAKING
పత్తి రైతులకు ‘క్యాష్‌ కటింగ్‌’తో నష్టం శివాజీ నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం గుండె పోటుతో వ్యక్తి మృతి ఘనంగా గజ్జె పూజా కార్యక్రమ నిర్వహణ స్టేట్ ఆడిట్ టీఎన్జీవోస్ అనుబంధ ఫోరం ఎన్నికలు ఏకగ్రీవం ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష - కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ ప్రక్షాళన "సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం". పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అంతర్జాతీయ వాణిజ్య మేళాలో ఈపీఎఫ్ఓ పెవిలియన్‌కు కాంస్య పతకం నారీ శక్తి వందన్ సవరణ నేటి తక్షణ అవసరం దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మితవాద పార్టీల జోరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

Select Suryaa Now
భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు, మేజర్ న్యూస్: తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతో పాటు ప్రజలు, భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన మెడి మహేష్ కుమార్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. మూడేళ్ల పాటు కొనసాగనున్న నూతన కమిటీ పాలకవర్గ సభ్యులను ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటానని, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తమకు బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి చైర్మన్ మెడి మహేష్ కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు, సమాజ పెద్దలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.