BREAKING
పత్తి రైతులకు ‘క్యాష్‌ కటింగ్‌’తో నష్టం శివాజీ నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం గుండె పోటుతో వ్యక్తి మృతి ఘనంగా గజ్జె పూజా కార్యక్రమ నిర్వహణ స్టేట్ ఆడిట్ టీఎన్జీవోస్ అనుబంధ ఫోరం ఎన్నికలు ఏకగ్రీవం ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష - కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ ప్రక్షాళన "సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం". పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అంతర్జాతీయ వాణిజ్య మేళాలో ఈపీఎఫ్ఓ పెవిలియన్‌కు కాంస్య పతకం నారీ శక్తి వందన్ సవరణ నేటి తక్షణ అవసరం దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మితవాద పార్టీల జోరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు

Select Suryaa Now
దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు
సూర్య - పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించగా ఈ వో శంకరయ్య, సర్పంచ్ బొక్కల రేఖ సంతోష్ లు ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. స్వామివారి జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో  పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ నరేష్  ముత్యాల, సర్పంచ్ లు గుర్రపు అంజయ్య, అరె సంతోష్, గంట రమేష్, మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేష్, చుంచు సదయ్య,  కాంగ్రెస్ నాయకులు సందనవేణీ రాజేందర్, తలారి సాగర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.