BREAKING
సమాజ నిర్మాణంలో చేనేతల పాత్ర కీలకం : ఎమ్మెల్యే నసీర్ నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం - నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పత్తి రైతులకు ‘క్యాష్‌ కటింగ్‌’తో నష్టం శివాజీ నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం గుండె పోటుతో వ్యక్తి మృతి ఘనంగా గజ్జె పూజా కార్యక్రమ నిర్వహణ స్టేట్ ఆడిట్ టీఎన్జీవోస్ అనుబంధ ఫోరం ఎన్నికలు ఏకగ్రీవం ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష - కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ ప్రక్షాళన "సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం". పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అంతర్జాతీయ వాణిజ్య మేళాలో ఈపీఎఫ్ఓ పెవిలియన్‌కు కాంస్య పతకం నారీ శక్తి వందన్ సవరణ నేటి తక్షణ అవసరం దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం

ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష - కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

Select Suryaa Now
ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష - కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
సూర్య కరీంనగర్ : సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అత్యంత ప్రశాంతంగా ముగిసిందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు.పరీక్ష సజావుగా సాగేందుకు కమిషనరేట్ పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సుమారు 250 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ పేర్కొన్నారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 అమలు చేయడంతో పాటు, సమీపంలోని జిరాక్స్ షాపులను పూర్తిగా మూసివేయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.కరీంనగర్‌లోని వివిధ పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షకు మొత్తం 14,095 మంది అభ్యర్థులను కేటాయించగా, వారిలో 13,102 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, 993 మంది గైర్హాజరయ్యారని సీపీ గౌష్ ఆలం వివరాలు వెల్లడించారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.