telangana
గుండె పోటుతో వ్యక్తి మృతి
సూర్య, జన్నారం : జన్నారం మండలం పొనకల్ పంచాయతీ పరిధిలో గల మేదరివాడ కాలనీకి చెందిన మామిడిపల్లి శంకరయ్య (58) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో చాతిలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటినా చికిత్స నిమిత్తం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో అక్కడి నుంచి హుటా హుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షలు జరపగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మామిడిపల్లి శంకరయ్య అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి కానరాని లోకాలకు వెళ్లాడని ఆ కాలనీవాసులు కన్నీరు పెట్టుకున్నారు. మృతునికి భార్య సునీత, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.