telangana
స్టేట్ ఆడిట్ టీఎన్జీవోస్ అనుబంధ ఫోరం ఎన్నికలు ఏకగ్రీవం
సూర్య కరీంనగర్ : స్టేట్ ఆడిట్ టీఎన్జీవోస్ అనుబంధ ఫోరం సిరిసిల్ల జోన్-III, కాళేశ్వరం జోన్-I నూతన కార్యవర్గ ఎన్నికలు కరీంనగర్ జిల్లా టీఎన్జీవోస్ భవనంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికలకు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, సహాయ ఎన్నికల అధికారిగా జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించగా, రాష్ట్ర ఫోరం కన్వీనర్ శశిధర్ రెడ్డి, ఎం. కిషన్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పరిశీలకులుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాయకత్వం కోసం ఎదురుచూడకుండా బాధ్యత తీసుకొని పనిచేసే వారే నిజమైన నాయకులని అన్నారు. 80 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన తెలంగాణ ఎన్జీవో సంఘం క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిందని పేర్కొన్నారు. నూతన కార్యవర్గాలు సంఘ రాజ్యాంగం, బైలాస్‌కు అనుగుణంగా పనిచేస్తూ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.సిరిసిల్ల జోన్-III కార్యవర్గం: అధ్యక్షుడిగా ఈ. లక్ష్మీకాంతయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా అల్లె శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎ. అనిల్ కుమార్, కె. బాను మోహన్ రెడ్డి, కె. చిరంజీవి, ఎల్. ఉమాదేవి, కార్యదర్శిగా ఏ.వి. రాజేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులుగా బి. దత్తాద్రి, కె. మానస, కోశాధికారిగా డి. మునిబాబు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా జె. శంకర్, ఎ. కరుణాకర్, జె. చిరంజీవి, సయ్యద్ యూనస్, కె. అశ్విజ ఎన్నికయ్యారు.కాళేశ్వరం జోన్-I కార్యవర్గం: అధ్యక్షుడిగా ఎస్. సుధీర్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఆర్. అనిల్ రాథోడ్, ఉపాధ్యక్షులుగా ఎం.డి. ఫయాజ్, ఈ. మాధవి, కార్యదర్శిగా బి. సచిన్ రాహుల్, సంయుక్త కార్యదర్శిగా ఎం. శోభ, కోశాధికారిగా కె. ధీరజ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా యు. సుకుమార్, ఎన్. రంగ విష్ణు, జె. సుమలత, టి. విజయ ఎన్నికయ్యారు.ఈ రెండు జోన్ల నూతన కార్యవర్గాలు 2026 నుంచి 2029 వరకు మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నాయి. కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సర్దార్ హర్మేందర్ సింగ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట రామస్వామి, కామారెడ్డి జిల్లా ట్రెజరర్ దేవరాజు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గాలకు దారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.